సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,సర్వేల్,అక్టోబర్1,(గరుడ న్యూస్):

సంస్థాన్ నారాయణపురం మండలం
సర్వేల్ గ్రామం లో దుర్గామాత భక్తజన బృందం ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి నవరాత్రోత్సవాలలో భాగంగా దుర్గాదేవి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి.అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చలమల్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ దసరా పండుగ గ్రామ ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ వారు ఆయనకు శాలువా కప్పి సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో భాస్కర్,ఉత్సవ కమిటీ వారు,గ్రామ ప్రజలు,తదితరులు,పాల్గొన్నారు.



