గరుడ న్యూస్ అక్టోబర్ 06
నిమ్మలపల్లి మండలం బండ్లపై పంచాయతీ దుర్గం వారి పల్లె గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయంలో సోమవారం విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు . ఆలయ అర్చకులు విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో సోమవారం ఉదయాన్నే స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి, స్వామివారిని రంగురంగుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు , అభిషేకానికి విచ్చేసిన భక్తులకు వారి వారి గోత్రనామాలతో అర్చనలు చేసి పూజా కార్యక్రమాలు, చేపట్టారు . ఉబయదారులు గా కల్లూరు కు చెందిన శివ, ధర్మపత్ని శిరీష పాల్గొన్నారు. ఆలయ స్థలదాత ఆలయ ధర్మకర్త లోకేశ్వర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం అభిషేకాలు విశేషమైన పూజలు ఉంటాయని ఆయన తెలియజేశారు. ప్రతి సోమవారం నిర్వహించే అభిషేకాలంలో భక్తులు పాల్గొని మనశ్శాంతి ఆయురారోగ్యాలు, పొందాలని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. లోకేష్ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.



