సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, అక్టోబర్10,(గరుడ న్యూస్):
తుర్కయంజాల్ ప్రజలకు రుచిలో కొత్త అనుభూతిని పరిచయం చేస్తూ,ప్రముఖ ఐస్ క్రీమ్ బ్రాండ్ హాంగ్యో (హాంగ్యో),యొక్క అధికారిక ఐస్ క్రీమ్ పార్టనర్ స్టోర్ అత్యంత వైభవంగా ప్రారంభమైంది.ప్రాంతీయ ప్రముఖులు,యువత సమక్షంలో,లింగంపల్లి నాగరాజు ఈ స్టోర్‌ను ప్రారంభించి తుర్కయంజాల్ వాసులకు అత్యుత్తమ నాణ్యత గల ఐస్ క్రీమ్ ఉత్పత్తులను అందించడానికి ముందుకు వచ్చారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ శాసన సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,ముఖ్య అతిథిగా విచ్చేసి,స్టోర్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన లింగంపల్లి నాగరాజు,ని అభినందించారు.నగర శివార్లలో ఇలాంటి నాణ్యమైన వ్యాపార సంస్థలు ఏర్పాటు కావడం ఈ ప్రాంత అభివృద్ధికి నిదర్శనం యువతకు,ప్రజలకు మంచి నాణ్యమైన ఉత్పత్తులను అందించాలనే నాగరాజు సంకల్పం ప్రశంసనీయం అని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ పాశం ఉపేందర్ రెడ్డి,దోటి సైదులు,లింగంపల్లి అంజి,తదితరులు పాల్గొన్నారు.
