సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,పుట్టపాక,అక్టోబర్15,(గరుడ న్యూస్):

పుట్టపాక గ్రామంలో క్రియేటర్ సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఫౌండర్ సామల భాస్కర్ గారి ఆధ్వర్యంలో యంగ్ ఇండియన్స్ చైర్మన్ అశ్విన్ అగర్వాల్,కో చైర్మన్ పూనమ్ అగర్వాల్,గ్రామీణ ఇనిషియేటివ్ చైర్మన్ అర్జున్ కేడియా,కో చైర్మన్ నిఖిల్ బహేటి గారల సౌజన్యంతో ఈరోజు
పద్మశాలి చేనేత కళాకారులకు ఉచితంగా కంటి అద్దాలను ఇవ్వడం జరిగినది.ట్రస్ట్ ఫౌండర్ భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందుటకు పద్మశాలి చేనేత కళాకారులందరూ ఏకతాటిపై ఉండి,మన జీవన స్థితిగతులు మారడానికి ప్రతి చేనేత సమావేశాలకు హాజరుకావాలని,మన హక్కులు మన వాటాను సాధించుకోవాలని అన్నారు.ఇండియన్స్ వారికి పుట్టపాక గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎంగ్ ఇండియన్స్ అధినేత
ఈ యొక్క కార్యక్రమంలో పుట్టపాక పద్మశాలి సంఘం అధ్యక్షులు గజం హనుమంతు,రాష్ట్ర పద్మశాలి మహిళా సంఘం ఉపాధ్యక్షులు శ్రీమతి సామల విజయలక్ష్మి,మండల పద్మశాలి నాయకులు గజం వెంకటేశ్వర్లు,పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు పానుగంటి వెంకట్రావు, కోశాధికారి అయిటిపాముల శంకర్,సహాయ కార్యదర్శి రావిరాల మల్లేష్,కార్యవర్గ సభ్యులు గంజి శంకరయ్య,వాసం మహేష్,సామల యాదయ్య,తడక వెంకటేశ్వర్లు,గుండు చంద్రకళ,గజం నిర్మల,పద్మశాలి చేనేత కళాకారులు,పాల్గొన్నారు.



