గరుడ ప్రతినిధి
చౌడేపల్లి అక్టోబర్ 15
మండలంలో నూతనంగా 13 మంది ఉపాధ్యాయులు నియమించబడ్డారు, ఇటీవల జరిగిన డీఎస్సీలో మండలానికి 13 మంది ఉపాధ్యాయులను కేటాయించినట్లు ఎంఈఓ కేశవరెడ్డి తెలిపారు. దీంతో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ భర్తీ జరిగినట్లు అయింది కాగా మరిన్ని పాఠశాలల్లో ఏకోపాధ్యాయ బడులు ఉన్నాయని వాటిని సైతం ప్రభుత్వం భర్తీ చేస్తుందన్న ఆశాభావంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉన్నారు.



