గరుడ ప్రతినిధి
చౌడేపల్లి అక్టోబర్ 15
చౌడేపల్లి మండలంలోని పంచాయతీ కేంద్రం అయినా చారాల ఉన్నత పాఠశాలలో ఈనెల 17న కబడ్డీ జట్ల ఎంపికను నిర్వహిస్తున్నట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు రేణుక తెలిపారు.ఎస్ జి ఎఫ్ ఐ క్రీడల్లో భాగంగా పలమనేరు డివిజన్ స్థాయిలో అండర్ 14, 17 బాల బాలికల కబడ్డీ టోర్నమెంటు ఎంపిక నిర్వహించబడుతుందన్నారు. ఈ పోటీలో పలమనేరు డివిజన్ కు సంబంధించిన పది మండలాల నుంచి 44 జట్టులో పాల్గొంటారని తెలియజేశారు అండర్ 17 బాల బాలికలు 55 కిలోలు లోపు బరువు కలిగి ఉండాలని అదేవిధంగా అండర్ 14 బాలురు 51 కిలోలు బాలికలు 48 కిలోలు లోపు బరువు కలిగి ఉండాలన్నారు.అలాగే వారిని తీసుకువచ్చే ట్రైన్ మేనేజర్లు తప్పనిసరిగా ఫామ్ ఏ మిడ్ డే మీల్స్ అక్విటెన్స్ తప్పకుండా తీసుకురావాలని తెలియజేశారు ఈ సమావేశంలో వ్యాయామ ఉపాధ్యాయులు రాజేంద్ర బాబు మండల కోఆర్డినేటర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.



