
‘కాంతార చాప్టర్ 1′(కాంతార అధ్యాయం 1)సాధించిన విజయం తాలూకు స్వరూపం అందరికి తెలుసు. మేకింగ్, టెక్నికల్, పర్ఫార్మెన్స్ పరంగా పాన్ ఇండియా మేకర్స్ ముందు సరికొత్త సవాలు కూడా ఉంచింది. సాధారణ సినిమాలకి భిన్నంగా సిల్వర్ స్క్రీన్ పై ఒక సరికొత్త ప్రపంచం ప్రత్యక్షమవ్వడంతో ప్రేక్షకులైతే కాంతార కి సరెండర్ అవ్వడంతో పాటు, ఐ ఫీస్ట్ అనుభూతిని కూడా పొందుతున్నారు.
రీసెంట్ గా కాంతారా చాప్టర్ 1 కి సంబంధించిన కొత్త ట్రైలర్ విడుదలైంది. తమకి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మూడు నిమిషాల నిడివితో విడుదల చేసిన ట్రైలర్, మొదటి ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారడంతో పాటు, ఈ ట్రైలర్ చూసిన అభిమానులు మళ్ళీ మూవీకి వెళ్లాలని అనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.
కలెక్షన్స్ పరంగా చూస్తే ఇప్పటి వరకు 700 కోట్ల రూపాయల గ్రాస్ ని రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాల లెక్కలు చెప్తున్నాయి. పైగా రెండు వారాలకే ఆ ఫీట్ ని సాధించడం విశేషం. తెలుగులోనే ఇప్పటి వరకు 100 కోట్ల గ్రాస్ కి పైగా రాబట్టి మరిన్ని కలెక్షన్స్ సాధించే దిశగా సాగుతుంది.



