సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,అక్టోబర్18,(గరుడ న్యూస్):

42 శాతం బీసీ రిజర్వేషన్ల హైకోర్టు స్టే నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని దుకాణాలను వ్యాపార సంస్థలను విద్యాసంస్థలను బందు చేసి స్థానిక చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు బొల్లేపల్లి లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరారు.గవర్నర్ దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర బీసీ రిజర్వేషన్లపై పెండింగ్ లో ఉన్న 9 వ, తొమ్మిదవ షెడ్యూల్ కింద తక్షణమే(జి ఓ),ఇవ్వాలని డిమాండ్ చేశారు.అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గణం నరసింహ కురుమ,మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు వీరమల్ల కార్తీక్ గౌడ్,కొప్పు రామకృష్ణ,
మండల కార్యదర్శి ఉప్పరగోని రాజు,అఖిలపక్ష నాయకులు ఉప్పల లింగస్వామి,అక్బర్ అలీ,ఏపూరి సతీష్,వీరమల్ల వెంకటేష్ గౌడ్, బచ్చనబోని గాలయ్య యాదవ్,సిలివేరు అంజయ్య,పందుల యాదగిరి,వంగరి రఘు,బచ్చనబోయిన దేవేందర్ యాదవ్,సూరపెళ్లి శివాజీ,రత్తుపల్లి యాదయ్య,దూసరి వెంకటేష్ గౌడ్, బైకని నరేందర్ యాదవ్,సురపెళ్లి వెంకటేష్,ఎలిజాల శ్రీను,బద్ధుల యాదగిరి,తదితరులు,పాల్గొన్నారు.



