సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, అక్టోబర్20,(గరుడ న్యూస్)

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.రెండేళ్ల ప్రజా పాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయని,అన్ని వర్గాల ప్రజల సంక్షేమం,అభివృద్ధి లక్ష్యంగా ప్రజల జీవితాల్లో ప్రజా ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకువచ్చిందని ఎమ్మెల్యే అన్నారు.చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ వెలుగుల పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు.దీపాల కాంతులతో ప్రతి ఇంటింటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.పర్యావరణానికి హాని కలిగించకుండా చిన్నా పెద్దలందరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలని,ప్రమాదాలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.


