గరుడ ప్రతినిధి
చౌడేపల్లి అక్టోబర్ 21
పోలీసు అమరవీరులకు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఘన నివాళి లభించింది మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక పోలీసు సర్కిల్ కార్యాలయం వద్ద పుంగనూరు రూరల్ సీఐ రాంభూపాల్ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సి. ఐ రాంభూపాల్ ప్రసంగిస్తూ నిత్యం ప్రజల కోసం ఆరాటపడే పోలీసులు సమాజంలో అందరికీ ఆదర్శప్రాయులన్నారు, కుటుంబాన్ని సైతం లెక్కచేయకుండా సమాజంలో ప్రాణ మాన ధనానికి రక్షణ కల్పించడమే పరమావధిగా పనిచేస్తున్నామని ఆయన అన్నారు అనంతరం అసువులు బాసిన పోలీసు వీరుల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఎస్. ఐ నాగేశ్వరరావు, పి.ఎస్.ఐ మణికంఠేశ్వర రెడ్డి,సిబ్బంది పాల్గొన్నారు.



