సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,చిల్లాపురం,అక్టోబర్22,(గరుడ న్యూస్):
ఈ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ సభ్యుడు,లచ్చమ్మ గూడెం గ్రామానికి చెందిన పున్న వెంకటేష్ తండ్రి పున్న నర్సింహా,మరణించడంతో…
విషయం తెలుసుకున్న ఈ ఎల్ వి భాస్కర్ సూచన మేరకు ఫౌండేషన్ డైరెక్టర్ అశోక్, పున్న వెంకటేష్, కుటుంబ సభ్యులను పరామర్శించి 20,000, ఇరవై వేల రూపాయల ఆర్ధిక సహాయం అందించి వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ ఎల్ వి ఫౌండేషన్ సభ్యులు,గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.



