లోకేష్ ని కలిసిన బండ్ల గణేష్ ..అసలు ఏం జరుగుతుంది! – Garuda Tv

Garuda Tv
1 Min Read


పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్'(పవన్ కళ్యాణ్)వీరాభిమానిగా ప్రొడ్యూసర్, నటుడు బండ్ల గణేష్(బండ్ల గణేష్)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. మైక్ పట్టుకొని ఒక అంశంపై స్పీచ్ ఇచ్చాడంటే ఆ మాటల తూటాల తాలూకు దెబ్బకి అగ్ర రచయితల పెన్ను నుంచి వచ్చే డైలాగులు కూడా సరితూగవు. అంతలా తన పంచులతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాడు. వీరి స్పీచ్ కూడా నిమిషాల్లో వైరల్ గా మారడం కూడా బండ్ల గణేష్ స్పెషాలిటీ. అసలు బండ్ల గణేష్ ఒకరిని కలిసాడంటే వాళ్ళతో ఏం మాట్లాడి ఉంటాడు అనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటుంది.


నిన్న బండ్ల గణేష్ కడప(kadapa)జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్(Cherukuri Sridhar)కుమారుడి వివాహానికి హాజరయ్యారు. ఈ వివాహానికి ఆంధ్రప్రదేశ్ కి చెందిన మంగళగిరి శాసనసభ్యులు, ఐటి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్(నారా లోకేష్)గారు హాజరై వధూవరుల్ని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ గారిని బండ్ల గణేష్ కలిసి ఆప్యాయంగా మాట్లాడటం జరిగింది. లోకేష్ గారు కూడా బండ్ల గణేష్ ని ప్రోత్సహిస్తున్నట్టుగా భుజంపై చేయి వేసి మాట్లాడారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నారా లోకేష్ గారితో బండ్ల గణేష్ ఏం మాట్లాడాడు అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు అక్రమ కేసులు బనాయించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(చంద్రబాబు నాయుడు)గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ ని వ్యతిరేకిస్తూ బండ్ల గణేష్ తన దైన స్టైల్లో నిరసన వ్యక్తం చేసాడు. 2024 లో జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీ తో ముఖ్యమంత్రి అవుతాడని చెప్పడం జరిగింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *