సింగం కృష్ణ భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మునుగోడు ప్రతినిధి, అక్టోబర్28,(గరుడ న్యూస్)

సంస్థాన్ నారాయణపురం గుజ్జ గ్రామానికి చెందిన చేన్నోజు రామాచారి వయస్సు 26, ఇంటి వద్ద ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో మరణించాడు.ఈ నేపథ్యంలో ఈ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ సభ్యులు ఆ కుటుంబాన్ని పరామర్శించి భరోసగా నిలిచి 5000/–,ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.కుటుంబానికి ఒక క్వింటల్ బియ్యం ఇస్తామని హామీ ఇచ్చి ఒంటరిగా ఉన్న ఆ తల్లికి మునుముందు ఈ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ అండగా ఉంటుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఈ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ సభ్యులు బండమీది కిరణ్,ఒర్సు విజయ్,ఎలిజాల శ్రీను,సిలువేరు సతీష్,పోలోజు వెంకటేష్,ఎర్ర పవన్,చాడ లింగస్వామి,చాడ రాములు,చాడ నరసింహ,గ్రామస్తులు,తదితరులు,పాల్గొన్నారు.



