చిరంజీవి పై మాళవిక మోహనన్ వ్యాఖ్యలు.. రూమర్స్ కి కీలక చెక్ – Garuda Tv

Garuda Tv
2 Min Read


– స్పీడ్ పెంచిన చిరంజీవి
– మెగా 158 అప్ డేట్
– మాళవిక మోహనన్ కీలక వ్యాఖ్యలు
– బాబీ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్

మెగాస్టార్ ‘చిరంజీవి'(చిరంజీవి)హీరో అనే స్థాయి నుంచి అభిమానులు, ప్రేక్షకుల ఇంటి సభ్యులుగా మారి చాలా సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Vara Prasad Garu)షూటింగ్ తో ప్రస్తుతం ఉన్నాడు. ఇటీవల ఈ చిత్రం నుంచి ‘మీసాలపిల్ల'(మీసాల పిల్ల)సాంగ్ వచ్చి రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. దీంతో చిరు స్టామినా ఏంటో మరోసారి చెప్పింది. 2026 సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు థియేటర్స్ లో అడుగు పెట్టనున్నారు. కానీ ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే నో రెస్ట్ ఓన్లీ యాక్షన్ అనేలా వాల్తేరు వీరయ్య దర్శకుడు ‘బాబీ'(బాబీ)తో నెక్స్ట్ ప్రకటించాడు. చిరు నుంచి వస్తున్న 158 మూవీ కావడంతో మెగా 158గా చిత్రీకరణ జరుపుకోనుంది.

మోస్ట్ లీ ఈ చిత్రం కూడా త్వరలోనే షూట్ కి వెళ్లనుందని మిగిలిన పనుల్లో బాబీ ఉన్న ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. ఇక ఈ చిత్రంలో చిరుకి జోడిగా ప్రముఖ హీరోయిన్ మాళవిక మోహనన్(మాళవిక మోహనన్)జోడి కట్టబోతుందనే వార్తలు కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి రేపో మాపో అధికార ప్రకటన రానుందనే వార్తలు కూడా జోరుగానే వచ్చాయి. కానీ అనూహ్యంగా ఈ విషయంపై మాళవిక మోహనన్ స్పందించడం జరిగింది. ఆమె మాట్లాడుతు నేను మెగా 158 లో వస్తున్నాననే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కెరీర్ లో చిరంజీవి గారి బడా హీరోతో చెయ్యాలని కోరుకుంటున్నాను. ఆ అవకాశం కోసమే చూశాను. కానీ మెగా 158 లో మాత్రం చేయడం లేదని.


Also Read: ఇడ్లీ కొట్టు ఓటిలోకి వచ్చేసింది.. అయితే ఏం చేయాలో తెలుసా!

మలయాళ చిత్రపరిశ్రమకి చెందిన మాళవిక మోహనన్ 2013 లో దుల్కర్ సల్మాన్ తో కలిసి ‘పట్టంపోలె’ అనే మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. అనతి కాలంలోనే ఇతర భాషల్లోకి ప్రవేశించి మాస్టర్, పేట, తంగలాన్, హృదయ పూర్వం వంటి అగ్ర హీరోల చిత్రాలలో చేసి పాన్ ఇండియా నటిగా గుర్తింపు పొందింది. ఆ లెగసి నే కంటిన్యూ చేస్తు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ది రాజాసాబ్ లో చేస్తుంది. ప్రచార చిత్రాలు చూస్తుంటే కథకి చాలా ఇంపార్టెన్స్ క్యారెక్టర్ లోనే మాళవిక మోహన్ కనిపించబోతున్నట్లుగా అర్ధం అవుతుంది. ప్రస్తుతం తన లిస్ట్‌లో సర్దార్ 2 మాత్రమే ఉంది.ఇందులో కార్తీ హీరో. మెగా 158లో చిరు సోదరుడిగా కార్తీ చేస్తున్నాడనే వార్తలు గత కొద్దీ రోజుల నుంచి వినిపిస్తున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *