గరుడ ప్రతినిధి
చౌడేపల్లి అక్టోబర్ 31
మండల కేంద్రమైన చౌడేపల్లి లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతిని పురస్కరించుకొని రాష్ట్రీయ ఐక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు,పోలీసు శాఖ ఎస్సై నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు 3k రన్ ను నిర్వహించారు, ఉదయాన్నే కళాశాలలో భారత మొట్టమొదటి ఉప ప్రధాని అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు. అర్పించారు, అనంతరం ఆయన భారత దేశా ఐక్యత కోసం చేసిన సేవలను వివరించారు. సమైక్యతవాదం ఆయన నినాదమని ఐకమత్యంతో ఏదైనా సాధించవచ్చునని సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క మాటలను ఆదర్శంగా తీసుకుని దేశ ఐక్యత కు కృషి చేయాలి అని ఆ విధంగా యువతీ యువకులు నేర్చుకోవాలని పలువురు వక్తలు కోరారు, అనంతరం త్రీ కే రన్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు.ఈ కార్యక్రమంలో పి ఎస్ ఐ మణికంఠేశ్వర్ రెడ్డి,ప్రిన్సిపాల్ జయప్రకాష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బాలాజీ,కళాశాల అధ్యాపకులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






