అధైర్యపడొద్దు… అండగా మేమున్నాం

G Venkatesh
1 Min Read

Article Image 1

— మిద్దింటి కిషోర్‌బాబును పరామర్శించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

–కార్యకర్తలతో చర్చించిన ఎమ్మెల్యే,మాజీ ఎంపీ

— కూటమి వైఫల్యాలను ప్రజలకు తెలియజేద్దాం

- Advertisement -
Ad image

నవంబర్ 01 గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గం ఇంచార్జి.గ్రామ స్థాయినుంచి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూటమి ప్రభుత్వ కుట్రలకు భయపడొద్దని…. ఎవరికి ఏకష్టవెహోచ్చినా మేమున్నాం అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భరోసానిచ్చారు. శనివారం మదనపల్లె పట్టణంలోని దేవతా నగర్‌లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మిద్దింటికిషోర్‌బాబును చిత్తూరు మాజీ ఎంపీ ఎన్‌.రెడ్డప్ప, ఎన్‌. శ్రీనాథరెడ్డి తో కలిసి పరామర్శించారు. ఇటీవల జరిగిన బైక్‌ ప్రమాదంలో కుడికాలుకు దెబ్బ తగలడంతో తిరుపతి లో ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్సల అనంతరం ఇంటికి వచ్చారు. ప్రమాదం జరిగిన తీరుతోపాటు ఆరోగ్య పరిస్థితులపై పెద్దిరెడ్డి అడిగి తెలుసుకొన్నారు. అధైర్యపడొద్దని త్వరగా కోలుకుంటారని ఆరోగ్యజాగ్రత్తలు వైద్యుల సలహామేరకు పాటించాలని సూచించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం చౌడేపల్లె , పుంగనూరు మండలాలనుంచి అక్కడికి చేరుకొన్న నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చర్చించారు. పలు అంశాలపై అడిగి తెలుసుకొని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ధీటుగా ఎదుర్కొని ప్రజలకు తెలియజేయాలన్నారు. మెడికల్‌ కళాశాలల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని అన్నిమండ లాల్లో చేపట్టిన కోటి సంతకాల సేకరణపై ఆరా తీశారు.ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి, వైస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షులు నాగభూషణరెడ్డి, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, కోఆప్షన్‌మెంబరు సాధిక్‌భాషా,డిసిసిబి మాజీ డైరక్టర్‌ రమేష్‌బాబు, నాయకులు జి.శ్రీనివాసులరెడ్డి, రంగనాథ్‌,గిరిబాబు,చిన్నప్ప,మోహన్‌యాదవ్‌,శ్రీనివాసులు ,చిట్టీరెడ్డిపల్లి కృష్ణప్ప,నారాయణరెడ్డి, కురపల్లి విజయ్‌.తదితరులు పాల్గొన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *