సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, చౌటుప్పల్,నవంబర్03,(గరుడ న్యూస్):

చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి వెళ్లిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి,కి అనుకోని అతిది ఎదురోచ్చి మరి తన ఇంటికి తీసుకెళ్ళింది.మొదటి విడత జాబితాలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన బుర్ర రాములమ్మ తనకున్న స్థలంలో ఇంటిని నిర్మించుకుంటుంది.ఇప్పటికే మూడు విడతలుగా 4,00,000/–నాలుగు లక్షల రూపాయలు రాములమ్మకు ప్రభుత్వం నుండి అందాయి.ఇంటినిర్మాణ పనులు కొన సాగుతున్నాయి.తాను మీ వల్లే ఇల్లు కట్టుకుంటున్నానని నా ఇంటికి మీరు రావాలని ఆనందంతో ఆత్మీయతతో అభిమానంతో పిలిచింది.రాములమ్మ పిలవగానే క్షణం ఆలస్యం చేయకుండా నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇంటికి వెళ్లి ఇంటిని పరిశీలించి,ఎన్ని బిల్లులు వచ్చాయి ఎంత ఖర్చయిందని వివరాలు అడిగి తెలుసుకున్నారు.మీరు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించకపోతే నేను సొంత ఇల్లు కట్టుకోలేక పోయేదానినని మీ వల్లే ఈరోజు ఇల్లు కట్టుకుంటున్నారని మురిసిపోయింది.రాములమ్మ మురిసిపోతూ చెబుతున్న మాటలు విన్న రాజ్ గోపాల్ రెడ్డి మీ ఇంటి నిర్మాణం పూర్తవడానికి రెండు లక్షలు పంపిస్తానని మాట ఇచ్చాడు.అక్కడే ఉన్న స్థానిక నాయకులను రాములమ్మ ఇల్లు పూర్తయ్యే వరకు చూడాలని అదేశించారు.



