ఈ వారం మూవీ లవర్స్ కి పండగే.. థియేటర్, ఓటిటి రిలీజ్ ఇవే – Garuda Tv

Garuda Tv
2 Min Read


-ఈ వారం సినిమా పండగ
-తగ్గేదేలే అంటూ పోటాపోటీ
-ది గర్ల్ ఫ్రెండ్ పై భారీ అంచనాలు
-జటాధర తో సరికొత్త ప్రపంచం

ఏమైనా తెలుగు సినిమా ప్రేమికులు మాములు అదృష్టవంతులు కాదు. వాళ్ళకి సరికొత్త సినీ వినోదాన్ని అందించడానికి పలు చిత్రాలు వేగంగా ముస్తాబవుతున్నాయి. థియేటరే కాదు మేము సైతం వినోదాన్ని అందించే విషయంలో తగ్గేదెలే అంటూ ఓటి సంస్థలు కూడా తమ దగ్గర ఉన్న సినీ వినోదాన్ని పంచడానికి రెడీ అయ్యాయి. మరి వినోదాల జాతర ని చూసేద్దాం.

నవంబర్ 7 న నాలుగు చిత్రాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. వాటి వరుసల్లో విజయాలతో దూసుకుపోతున్న పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఒకటి. కథనం మొత్తం ఆమె చుట్టూనే నిర్మించడంతో మేకర్స్ ఆమె ఇమేజ్ కి తగ్గట్టుగా నిర్మించారు. రష్మిక కొంత గ్యాప్ తర్వాత చేస్తున్న కంప్లీట్ లవ్ స్టోరీ. లెజండ్రీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పకుడు. దీన్ని బట్టి గర్ల్ ఫ్రెండ్ క్వాలిటీ ని అర్ధం చేసుకోవచ్చు. ప్రచార చిత్రాలు కూడా బాగా తోడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చిత్ర విజయంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. విభిన్న చిత్రాల కథానాయకుడు సుదీర్ బాబు నుంచి ‘జటాధర’ కూడా థియేటర్లలో సందడి చేయనుంది.

అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి సంబంధించిన కొన్ని రహస్యాల చుట్టు జటాధర ప్రదర్శించింది. యాక్షన్, అడ్వెంచర్, ఫాంటసీ మిస్టరీ సబ్జెట్ అయిన థియేటర్లలో సరికొత్త ప్రపంచం ప్రత్యక్షం కాబోతుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పాత్రలో కనిపించడం స్పెషాలిటీ. ఇక క్రైమ్ విస్టిగేషన్ గా తెరకెక్కిన ఆర్యన్ అనే తమిళ చిత్రం కూడా నవంబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే పరిచయమైన విష్ణు విశాల్ హీరో. పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండగా ప్రచార చిత్రాలైతే ఆసక్తిని కలుగచేసే విధంగా ఉన్నాయి. ఇప్పటికే మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్న తిరువీర్ ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షోతో మరో మారు నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఓటిటి వేదికగా చేసుకుంటే నెట్ ఫ్లిక్స్ లో
నవంబర్ 3 న ఇన్ వేవ్స్ అండ్ మూవీ (హాలీవుడ్ మూవీ)
నవంబర్ 7 న బారాముల్లా(హిందీ).. ఈ రెండు కూడా సినిమాలే

అమెజాన్ ప్రైమ్ లో

నవంబర్ 2 రాబిన్ హుడ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
నవంబర్ 3 నైస్ టూ నాట్ మీట్ యు(కొరియన్ వెబ్ సిరీస్)

ఇది కూడా చదవండి: మన శంకర వరప్రసాద్ గారి బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి మరి!

జియో హాట్ స్టార్
నవంబర్ 4 బాడ్ గర్ల్ మూవీ(తమిళ్)
నవంబర్ 5 ది ఫెంటాస్టిక్ 4 (ఇంగ్లీష్)

సోనిలీవ్
నవంబర్ 7 మహారాణి వెబ్ సిరీస్ (హిందీ)

ఈ విధంగా థియేటర్స్ లోనే కాకుండా ఓటిటి వేదికగా స్ట్రీమింగ్ కి సిద్ధమైన చిత్రాలన్నీ కూడా విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *