నవంబర్ 04 గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్. ఆంద్రప్రదేశ్ సర్వేయర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డివిజన్ ఉపాధ్యక్షులు గా మూరళీకృష్ణ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈయన పదవి కాలం రెండు సంవత్సరాలు, పది మండలాలకు చెందిన సర్వేయర్లు కలసి సమావేశం ఏర్పాటుచేసుకున్నారని అందులో మురళీకృష్ణ ను ఏన్నుకున్నారు.ఈసందర్బంగా మురళీకృష్ణ మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో సర్వేయర్లకు గల సమస్యల పై పోరాటం చేస్తామని, వారి విధినిర్వహణ లో చాలా చోట్ల రైతులు సర్వేయర్ల పై భౌతిక దాడులు చేస్తున్నారని, అటువంటి వాటిని అరికట్టి,విధులలో పనిభారం తగ్గించాలని,వారివారి పరిధి లో కాకుండా ఒక్కొక్కరికి రెండుమూడు పంచాయతీలు అప్పచెప్తున్నారని అలా కాకుండా చూస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చౌడేపల్లి మండల సర్వేయర్లు ఆయన్ను దుశ్శాలువతో సత్కరించారు.



