గరుడ ప్రతినిధి చౌడేపల్లి నవంబర్ 05
చౌడేపల్లి మండలం లోని పంచాయతీ కేంద్రమైన పుదీపట్ల గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివ కేశవుల అలంకారంలో దర్శనమిచ్చిన వైష్ణవి దేవి ఆలయ అర్చకురాలు శ్రావణి ఉదయమే అమ్మవారికి పంచామృత అభిషేక చేసి కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికీ విశేషమని ఈ కార్తీకమాసంలో సకల దేవతలు పూజింపబడతారని ఎంతో పరమ పవిత్రమైన ఈ మాసంలో శివకేశవ అలంకారంలో దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఈరోజు ఉభయదారులుగా చింతామణికి చెందిన వెంకటేశ్వర్లు ధర్మపత్ని రజితగ కాటి పేరుకి చెందిన బోయకొండప్పగా వ్యవహరించారు.



