గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గం ఇంచార్జి 06/11/2025

పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలసియున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం రాత్రి కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని విష్ణుదీపంతో ప్రదర్శన, గరుడసేవ నిర్వహించారు. ఆలయ అర్చకులు విష్ణుదీపాన్ని వెలిగించి, భక్తి శ్రద్దలతో పట్టణ పురవీధుల్లో భక్తులకు దర్శనప్రాప్తి కల్పించారు. ఆలయ ధ్వజస్తంభం పై ఉంచి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ సీఐ సుబ్బరాయుడు, ఆలయ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి ల ఆధ్వర్యంలో బందోబస్తు కార్యక్రమాలు చేపట్టారు.


