గరుడ ప్రతినిధి చౌడేపల్లి నవంబర్ 05
చౌడేపల్లి లో గల మృత్యుంజయ స్వామి దేవస్థానం నందు కాగితి గ్రామపంచాయతీకి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు వెంకటేష్ (రమణ ) మరియు శివకుమార్ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఉచిత అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడు కార్తీక పౌర్ణమి రోజున అన్నదానం చేస్తామని వారు తెలిపారు, ఇలా అన్నదానం చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంటుందని వారు తెలియజేశారు.






