సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,చిల్లాపురం,నవంబర్07,(గరుడ న్యూస్):

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని చిల్లాపురం గ్రామంలో కార్తీకమాసం సందర్భంగా జరిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి జాతరలో ఈ ఎల్ వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్,డైరెక్టర్ అశోక్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ,ఆరోగ్య శిబిరం మరియు శుద్ధజల సదుపాయాలను ఏర్పాటు చేసి విశేష సేవలు అందించారు.ఈ సందర్భంగా ఈ ఎల్ వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ ని వావిళ్ళపల్లి గ్రామ నాయకులు శ్రీరాములు రవి,మర్యాదపూర్వకంగా కలిసి,ఈ ఎల్ వి ఫౌండేషన్ సేవా మరియు అభివృద్ధి కార్యక్రమాలను అభినందించారు.భవిష్యత్తులో కూడా ఆలయ అభివృద్ధి,ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఫౌండేషన్ నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఎల్ వి ఫౌండేషన్ భాస్కర్ ప్రజలకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు,భక్తులు,అభిమానులు తదితరులు,పాల్గొన్నారు.



