గరుడ ప్రతినిధి చౌడేపల్లి నవంబర్ 07
చౌడేపల్లి మండలంలోని జూనియర్ కళాశాల నందు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించిన త్రీ కే రన్ లో భాగంగా ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందించారు, ఎస్సై నాగేశ్వరరావు పి.ఎస్.ఐ మణికంఠేశ్వర్ రెడ్డి ల ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ జయప్రకాష్ వివిధ రంగాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు మెడల్ తో పాటు మెమొంటోలను బహుమతులుగా అందించారు, అదేవిధంగా వందేమాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గీతం యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.



