( గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గం ఇంచార్జి 08/11/2025 ) పుంగనూరు పట్టణంలోని ఎక్సెజ్ పోలీస్‌స్టేషన్‌లో సీజ్ చేసిన వాహనాలను ఈనెల 10న ఉదయం 10 గంటలకు వేలం వేయనున్నట్లు ఎక్సెజ్ సీఐ సురేష్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏఈఎస్ కృష్ణకిషోర్‌రెడ్డి ఆదేశాల మేరకు అక్రమ మధ్యం రవాణాలో సీజ్ చేసిన వాహనాలను వేలం వేస్తున్నామన్నారు. ఆసక్తి గల వ్యాపారులు నిబంధనల మేరకు తగిన ధరావత్తు చెల్లించి , వాహనాల వేలం పాటలో పాల్గొనాలని ఆయన కోరారు.



