– రాజమౌళి సినిమాలన్నీ కాపీలేనా?
– రాజమౌళికి హితబోధ చేస్తున్ననెటిజన్లు
– 160 దేశాల్లో ssmb29
రాజమౌళి సినిమా అంటే.. ఆరోజు నుంచే ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్‌డేట్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తుంటారు. బాహుబలి సిరీస్, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని హాలీవుడ్ వరకు తీసుకెళ్లిన రాజమౌళి.. ప్రస్తుతం మహేష్‌తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోంది. ఈ సినిమా అప్‌డేట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు.
ఎన్నో ఎదురుచూపుల తతర్వాత ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. కుంభ అనే విలన్ పాత్రలో కనిపించబోతున్న సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్ లుక్‌ను విడుదల చేశారు. మొదటి నుంచీ రాజమౌళి సినిమాలకు సంబంధించిన విడుదలైన పోస్టర్స్‌పై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ఇప్పుడీ సినిమాకి కూడా అదే పరిస్థితి వచ్చింది. పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే.. ఇది దానికి కాపీ, దీనికి కాపీ అంటూ దానికి సంబంధించిన పోస్టర్స్‌ని కూడా చూపిస్తున్నారు.
అంగవైకల్యంతో ఉన్న విలన్ రోబోటి వీల్ చైర్‌లో ఉన్న స్టిల్స్‌ను, వీడియోను విడుదల చేశారు. ఈ స్టిల్ గతంలో వచ్చిన వైల్డ్ వైల్డ్ వెస్ట్, స్పైడర్ మాన్ చిత్రాలలో పాత్రలను పోలి ఉంది. నిజానికి అలాంటి క్యారెక్టర్లు చాలా సినిమాల్లో ఉన్నాయి. సూర్య హీరోగా వచ్చిన 24 చిత్రంలో మూడు పాత్రల్లో కనిపిస్తాడు. అందులో ఒక పాత్ర వీల్ చైర్‌కే పరిమితమై ఉంటుంది. కుంభ క్యారెక్టర్ కూడా అదే తరహాలో ఉందని అంటున్నారు.
హాలివుడ్ సినిమాలను ఇన్‌స్పిరేషన్ తీసుకొని వివిధ భాషల్లో చాలా సినిమాలు వచ్చాయి. అందరిలాగే రాజమౌళి కూడా పరభాషా చిత్రాల్లోని సీన్స్‌ని కాపీ చేస్తాడనే అపవాదు ఉంది. అయితే అవేవీ పట్టించుకోని రాజమౌళి తన పనేదో తాను చేసుకుంటూ వెళ్లిపోతాడు. అయితే ట్రోలర్స్ వెలిబుచ్చిన అభిప్రాయాలు కొన్ని వాస్తవం కావచ్చు.
ఇప్పటికే తెలుగు సినిమా స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళికి ఇది తగదని హితబోధ చేస్తున్నారు. ఈ ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో విడుదల చేయబోతున్నట్టు. మరి ఆ స్థాయి సినిమాలో కూడా కాపీ సీన్స్ ఉండటం అనేది అందరూ ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికైనా రాజమౌళి వాస్తవంలోకి వచ్చి తనపై ట్రోలింగ్ జరగని విధంగా కంటెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని నెజటిన్లు అభిప్రాయపడుతున్నారు.



