మూడు సినిమాలు వరసగా చేసిన డైరెక్టర్‌, హీరోయిన్‌ మధ్య సమ్‌థింగ్‌.. సమ్‌థింగ్‌? – Garuda Tv

Garuda Tv
2 Min Read


సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి సర్వసాధారణం. సినిమా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తితోనే రూమర్స్‌ని ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఫాలో అవుతారు. ఇదే అదనుగా ఇలాంటి కొన్ని మీడియా సంస్థలు, కొందరు నెటిజన్లు రూమర్స్‌ని క్రియేట్‌ చేస్తున్నారు. నిజమా, అబద్ధమా అని తెలుసుకొనేలోపే అవి ప్రపంచాన్ని చుట్టి వస్తాయి. అలాంటి ఒక రూమర్‌ డైరెక్టర్‌ రవిబాబు విషయంలో పుట్టుకొచ్చింది. దానివల్ల మానసికంగా ఎంతో వ్యధకు లోనయ్యానని చెబుతారాయన. ఇంతకీ ఆ రూమర్‌ ఏమిటో, ఎలా స్ప్రెడ్‌ అయిందో చూద్దాం.

నటుడు చలపతిరావు తనయుడు రవిబాబు అమెరికాలో చదువుకొని అక్కడ ఉద్యోగం కూడా చేశాడు. అయితే టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా పేరు తెచ్చుకోవాలన్నా ఇండియాకి తెలుగులో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. ఆ తర్వాత ఇ.వి.వి.సత్యనారాయణ తనయుడు నరేష్‌తో ‘అల్లరి’ వంటిఫరెంట్‌ సినిమాని తెరకెక్కించి నరేష్‌కి దాన్నే ఇంటి పేరుగా మార్చాడు. రవిబాబు చేసే సినిమాలు రెగ్యులర్ ఫార్మాట్‌లో ఉండవు. మునుపెన్నడూ చూడని ఓ కొత్త కాన్సెప్ట్‌ అతని సినిమాల్లో కనిపిస్తుంది. నటినటుల కాస్ట్యూమ్స్‌ నుంచి బ్యాక్‌గ్రౌండ్‌ వరకు డిఫరెంట్‌గా ఉంటాయి.

అలా అమ్మాయిలు అబ్బాయిలు, పార్టీ, సోగ్గాడు వంటి సినిమాలు చేశాడు. భూమిక ప్రధాన పాత్రలో తను విలన్‌గా చేసిన అనసూయ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత అమరావతి, అవును, అవును2, ఆవిరి వంటి హారర్‌ మూవీస్ ప్రేక్షకులను అలరించాయి. అలాగే నచ్చావులే, నువ్విలా, మనసారా వంటి సినిమాలు కూడా చేశారు. ఇప్పటివరకు డైరెక్టర్‌గా 15 సినిమాలు చేశారు రవిబాబు. ప్రస్తుతం ‘ఏనుగుతొండం ఘటికాచలం’ చేస్తున్నారు. పూర్తి స్థాయి కామెడీతో రూపొందించిన ఈ చిత్రం నవంబర్ 13 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమ్‌ చేయబోతున్నారు.

ఇదిలా ఉంటే.. పూర్ణ హీరోయిన్‌గా మూడు సినిమాలు డైరెక్ట్ చేశారు రవిబాబు. వరసగా ఆమెతోనే సినిమాలు చేయడంతో ఇద్దరి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అనే రూమర్‌ ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో రెక్కలు కట్టుకొని రౌండ్లు వేసింది. అయితే పూర్ణ 2022లో పెళ్లి చేసుకుంది. అప్పటివరకు పూర్ణ, రవిబాబు మధ్య ఏదో ఉందనే వార్తలు వస్తూనే ఉండేవి. అప్పట్లో ఈ రూమర్ గురించి రవిబాబు కూడా స్పందించారు.

తాజాగా రవిబాబు రష్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సందర్భంగా పూర్ణ ప్రస్తావన వచ్చినపుడు ఆమె గురించి మాట్లాడారు. ‘పూర్ణ ఎంతో డెడికేషన్‌ ఉన్న ఆర్టిస్ట్‌. సెకండ్‌ టేక్‌ లేకుండా సింగిల్‌ టేక్‌లోనే షాట్‌ ఓకే చేసేది. అందుకే ఆమెతో వరసగా సినిమాలు చేశాను. క్యారెక్టర్‌కి పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అయితే వరసగా సినిమాలు చేయడంలో తప్పేముంది? ప్రస్తుతం నేను చేస్తున్న రష్‌ సినిమాలో ఫైట్స్‌ ఉంటాయి. పూర్ణ మంచి డాన్సర్‌ తప్ప ఫైట్స్‌ చేయలేదు. అందుకే ఆమెను తీసుకోలేదు’ అంటూ క్లారిటీ ఇచ్చారు రవిబాబు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *