గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గం ఇంచార్జి 11/11/2025. భారత ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై జరిగిన దాడికి నిరసనగా ఈనెల 17న ఎంఆర్‌పిఎస్ ఆధ్వర్యంలో జంతర్‌మంతర్ వద్ద నిరసన, ధర్నా కార్యక్రమాలకు తరలిరావాలని ఎంఆర్‌పిఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీఫ్ జస్టిస్‌పై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి, దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలన్నారు. మందకృష్ణ మాదిగ సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన ఏకైక ఉధ్యమకారుడని కొనియాడారు. ఈ ధర్నాకు అధిక సంఖ్యలో దళితులు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు టి.నరసింహులు, వెంకట్రమణ, ప్రభాకర్, ఆనంద తదితరులు పాల్గొన్నారు.



