గరుడ ప్రతినిధి
చౌడేపల్లి నవంబర్ 11
చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవం ను కళాశాల ప్రిన్సిపల్ జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం అసలు పేరు మొహియుద్దీన్ అహ్మద్, అని అబుల్ కలాం, ఆయన బిరుదు అని ఆజాద్ ఆయన కలం పేరు అని ప్రిన్సిపల్ వివరించారు. స్వాతంత్ర సమరయోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రి , ప్రఖ్యాత పండితుడు, కవి అని ఆజాద్ గారి గొప్పతనాలను కీర్తించారు. భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఘనత ఈయనది అనే విషయాలను విద్యార్థినీ విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పాల్గొన్నారు.






