నా అంతరాత్మ ఒక స్వర్ణయుగం.. భాగ్యశ్రీ బోర్సే మొత్తం చెప్పేసింది – Garuda Tv

Garuda Tv
2 Min Read


-భాగ్యశ్రీ బోర్సే ఏం చెప్పింది!
-కాంత గురించి ఏమంటుంది
-ఖుష్బూ చెప్పిన విషయాలు ఏంటి!

అందంతో పాటు అందానికి తగ్గ అభినయం కలగలిపిన నటిమణులు పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై ఎంతో రేర్ గా తళుక్కుమంటారు. అభిమానులు ప్రేక్షకులు కూడా నటిమణులని దేవకన్యలాగా భావిస్తున్నారు. అలాంటి ఒక దేవకన్యే ‘భాగ్యశ్రీ బోర్సే'(Bhagyashri Borse). అందుకే మొదటి చిత్రం మిస్టర్ బచ్చన్ పరాజయం పాలైనా వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. తన అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే ఈ నెల 14 న దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan)తో కలిసి చేసిన ‘కాంత’ తో తమిళ, తెలుగు, మలయాళ ప్రేక్షకులను పలకరించనుంది.

ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఈ కోరిక ఆమె మీడియాతో మాట్లాడుతుంది ‘కాంత'(కాంత)తోనే నేను దక్షిణాదికి పరిచయం కావాల్సింది. నేను విన్న మొట్టమొదటి సబ్జెక్టు కూడా ఇదే. కాకపోతే కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. 1950 ,60 వ కాలం నేపథ్యంలో జరిగే కథలో నా క్యారక్టర్ పేరు కుమారి. ఆ క్యారక్టర్ చెయ్యడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అలనాటి హీరోయిన్స్ లాగా కళ్ళతోనే భావాలు పలికించాలి. సారూప్య సావిత్రి, శ్రీదేవి గారి సినిమాలు చూడటంతో పాటు కొంత మంది మనుషులని కూడా కలిసాను. ఇప్పుడు పలికే సంభాషణలకి, నాటి తరం సంభాషణలకి చాలా తేడా ఉంది. అందుకే సంభాషణలు స్పష్టంగా చెప్పడానికే ఆరు నెలల సమయం తీసుకున్నాను.

ఈ మధ్య సీనియర్ నటి ఖుష్బూ గారిని కలిసాను. ఆమె నాతో మాట్లాడుతుంది సోషల్ మీడియా లేని రోజుల్లో జీవితం ఎంత వైవిధ్యంగా ఉంటుందో, ప్రస్తుతం సోషల్ మీడియా మోజులో పడి మనం ఎలాంటి ఆనందమైన జీవితాన్ని అనుభవించలేకపోతున్నామో చెప్తుంటే ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. ఆ కాలాన్నిస్వర్ణ యుగం అని ఎందుకు అంటారో కూడా ‘కాంత’ ద్వారా అర్ధమయింది. నా అంతరాత్మ మాత్రం అప్పటి కాలానికి దగ్గరగానే ఉన్నట్లు భాగ్యశ్రీ చెప్పుకొచ్చింది. మహారాష్ట్రలోని పూణే భాగ్యశ్రీ స్వస్థలం కాగా ‘రామ్ పోతినేని'(రామ్ పోతినేని)తో చేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’తో ఈ నెల 28న మరో మారు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *