లక్ష కోట్ల ఆస్తి నష్టం – మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

G Venkatesh
2 Min Read

గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గం ఇంచార్జి
13/11/2024

వైద్య, విద్య ప్రైవేటీకరణతో4500 సీట్లు నష్టం-క్యూభా దేశాన్ని చూసి నేర్చుకోవాలి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో 17 మెడికల్‌ కళాశాలలను ప్రారంభించడం జరిగిందని, వాటిని చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడంపై ప్రతి ఒక్కరు ఉధ్యమించాలని , లేకపోతే పేద విద్యార్థులు 4500 సీట్లు నష్టపోతారని , చిన్న దేశమైన క్యూభాలో వైద్య, విద్యను అధిక ప్రాధాన్యత ఇస్తుంటే మన ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి, లక్షల కోట్ల ఆస్తినష్టాన్ని రాష్ట్రానికి అందిస్తోందని మాజీ మంత్రి , పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గ స్థాయి నాయకులతో కలసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి , డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. తహశీల్ధార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకేసారి 17 వైద్య కళాశాలలను ప్రారంభించి, వాటి నిర్మాణం చేపట్టిన ఘనత వైఎస్‌.జగన్‌కు దక్కుతుందని అన్నారు. వీటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉండగా రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే అన్ని పూర్తి వినియోగంలోకి వస్తాని అన్నారు. వీటి పనులు పూర్తి చేయకుండా చంద్రబాబు ప్రైవేటీకరణకు చర్యలు తీసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ఫలితంగా పేద విద్యార్థులు సుమారు 2,150 సీట్లు ప్రస్తుతం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల మెడికల్‌ కళాశాలలో అడ్మీషన్లకు సిద్ధంగా్న న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మెడికల్‌ కౌన్సిల్‌కు లేఖరాసి , అడ్మీషన్లు జరగకుండ అడ్డుకున్నారని ఆరోపించారు. వైద్యకళాశాలలు ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు వైద్య, విద్యకు దూరమౌతుందని అన్నారు. ధనవంతులు విదేశాల్లో ఉన్నవారు , పొరుగు ర్ఖా•ల విద్యార్థులు ఇక్కడ వైద్య కళాశాలలో సీట్లు కొనుగోలు చేసొ చదువుకుంటారని అన్నారు. విద్య పూరైన తర్వాత వారి స్వస్థలాలకు లేదా విదేశాలకు వెళ్లిపోతారని , దీని వల్ల ర్ఖా•నికే ఒరిగేది ఏమి లేదని ఎద్దెవ చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య, విద్య ఉండాలని వైఎస్‌.జగన్‌ కష్టపడి కళాశాలలను చేపడితే ఇప్పుడు వాటిని చంద్రబాబు ప్రైవేటీకరణతో నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు రాష్ట్ర గవర్నర్‌కు వినతిపత్రం అందజేయడం జరుగుతుందని పెద్దిరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులు, మాజి ఎంపి రెడ్డెప్ప, టీటీడీ మాజీ బోర్డు మెంబరు పోకల అశోక్‌కుమార్‌, వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, జడ్పిటిసి దామోదర్ రాజు, కొండవీటి నాగభూషణం,మాజీ మండలం అధ్యక్షుడు అంజి బాబు,వైస్సార్సీపీ మండలం అధ్యక్షుడు నాగభూషణం రెడ్డి వైఎస్ బోయకొండ మాజీ చైర్మన్ లు మిద్దింటి శంకర్ నారాయణ, నాగరాజు రెడ్డి ఎంపీపీ లు నరసింహారెడ్డి సుధాకర్ రెడ్డి,సుధాకర్ రెడ్డి రాష్ట్ర విద్యార్థి విభాగ కార్యదర్శి కళ్యాణ్ భరత్, నియోజకవర్గంలోని సర్పంచులు నియోజకవర్గంలోని మాజీ చైర్మన్లు, మరియు సర్పంచులు ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *