మహేష్, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీకి సంబంధించిన ‘గ్లోబ్ ట్రోటర్’ ఈవెంట్ నవంబర్ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో గ్రాండ్‌గా జరగనుంది. ఇటీవలి కాలంలో కొన్ని పబ్లిక్ సినిమా ఫంక్షన్‌లలో జరిగిన దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ శాఖ ముందు జాగ్రత్త చర్యగా కొన్ని నిబంధనలు విధించబడ్డాయి. వాటిని వివరిస్తూ.. దర్శకుడు రాజమౌళి ఒక వీడియో విడుదల చేశారు.
‘మన ‘గ్లోబ్’ ట్రోటర్’ ఈవెంట్ కోసం మీరందరూ చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని తెలుసు. నేను కూడా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. మన ఈవెంట్ బాగా జరగాలంటే మీ అందరి సహకారం చాలా అవసరం. దీనికి ఉన్న క్రేజ్ దృష్ట్యా మనందరి సేఫ్టీ దృష్టిలో ఉంచుకొని పోలీస్ శాఖ కొన్ని కఠిన నిబందనలు విధించింది. అవన్నీ మనం ఖచ్చితంగా పాటించాలి. ఇది ఓపెన్ ఈవెంట్ కాదు. ఫిజికల్ పాసెస్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈవెంట్‌కి రావాలి. అలాగే నేను కొన్ని వీడియోలు చూశాను. ఇది ఓపెన్ ఈవెంట్ అనీ, ఎవరు పడితే వాళ్ళు రావొచ్చని చెబుతున్నారు. అలాగే ఆన్‌లైన్‌లో పాసులు అమ్మ ఉన్నారు. అదంతా నమ్మొద్దు. ఫిజికల్ పాస్ ఉన్నవారిని తప్ప మరెవరినీ అనుమతించే ప్రసక్తే లేదు
18 సంవత్సరాల లోపు వయసు వారిని, వృద్ధులను పోలీసులు అనుమతించడం లేదు. అందువల్ల అలాంటి వారు ఈవెంట్‌కి రాకుండా ఇంట్లోనే ఉండి జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూస్తే బెటర్. పోలీసుల నిబంధనలను పరిగణలోకి తీసుకుని ఈవెంట్‌ని చాలా స్ట్రిక్ట్‌గా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా ఈవెంట్‌ని అక్కడికక్కడే క్యాన్సిల్ చేయిస్తామని పోలీస్ కమిషనర్ వార్నింగ్ ఇచ్చారు. అందువల్ల అందరూ ఎవరికి వారు వారి సేఫ్టీ గురించి జాగ్రత్తలు తీసుకుని ‘గ్లోబ్’ ట్రోటర్’ ఈవెంట్‌ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.



