గరుడ ప్రతినిధి
చౌడేపల్లి నవంబర్ 14
మండలంలోని పంచాయతీ కేంద్రమైన పుదీపట్ల గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో కార్తీక శుద్ధ దశమి సందర్భంగా శుక్రవారం రోజున అమ్మవారికి 108 కలశములతో అభిషేకము సౌందర్యలహరి ,ఖడ్గమాల రుద్రం, పారాయణం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ సుధా స్వామి గురువుగారి శిష్యురాలైన శ్రీ శ్రీ మాంథత శంకర్ నారాయణ ధర్మపత్ని లక్ష్మీ సరస్వతి మేడం హైదరాబాద్ నుండి విచ్చేశారు .బెంగళూరు, తిరుపతి ,మదనపల్లి, వాయల్పాడు ,సిటిఎం, ధర్మవరం, రామ సముద్రము ,పలమనేరు, చిత్తూరు, కుప్పం ,చౌడేపల్లి, చుట్టుపక్కల గ్రామ ప్రజలు, సౌందర్యలహరి నేర్చుకున్న మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి ఇంత కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఆలయ అర్చకరాలు శ్రావణి అమ్మవారిని అభిషేకం అనంతరం రంగురంగు పూలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది ఇంత కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాంథత శంకర్ నారాయణ ధర్మపత్ని లక్ష్మీ సరస్వతి మేడం విచ్చేశారు పూజ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ జరిగింది.



