సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,నవంబర్15,(గరుడ న్యూస్):

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నూతనంగా ప్రారంభించిన నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో సహకార దినోత్సవం జరుపుకున్నారు.గ్రామీణ ప్రజలకు ఆర్థిక సహాయం,సామాజిక అసమానతలను తగ్గించడం ఎన్డిసిసిబి ముఖ్య ఉద్దేశం అని వారు తెలియజేశారు.సహకార దినోత్సవ సందర్భంగా తమ సంస్థ ఇతర సంస్థల కంటే కూడా ఎక్కువ వడ్డీ రేటుతో అందిస్తున్న పథకం సహకార కుబేర డిపాజిట్ స్కీం 222 రోజులకు 7.65 శాతం వడ్డీ.సీనియర్ సిటిజన్లు 8.15 శాతం వడ్డీ అందిస్తున్నారు.బంగారంపై వేగవంతమైన రుణ సేవలు,హౌసింగ్ లోన్,పథకం ద్వారా గరిష్ట రూపాయలు 40 లక్షల వరకు రుణ సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు. బ్యాంకులో ఏటీఎం,లాకర్,యూపీఐ, సౌకర్యాలు అందిస్తున్నామని తెలియజేశారు.ఈ సదుపాయాలను గ్రామీణ ప్రజల వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని బ్రాంచ్ మేనేజర్ శేఖర్ రెడ్డి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది సుష్మ,కర్ణ శ్రీ,గోల్డ్ అప్రైజర్ కూరెళ్ళ జలందర చారి,తదితరులు,పాల్గొన్నారు.



