గరుడ ప్రతినిధి
చౌడేపల్లి నవంబర్ 15
ఉత్పన్న ఏకాదశి సందర్బంగా విశేష అలంకరణలో దర్శనమిస్తున్న వేణుగోపాల స్వామి,రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి, కార్తీక మాసంలో ఉత్పన్న ఏకాదశి సందర్భంగా ఆలయ అర్చకులు వశిష్టాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి విశేషాలంకరణ మరియు అభిషేకం నిర్వహించారు. ఆలయానికి దాతలు నిత్య పూజలో ఉపయోగించే ఉపకరణాలను అందించారు, దేవినేని కృష్ణమూర్తి, శీలం అంజప్ప, కుటుంబ సభ్యులు రూ 13 వేలు విలువ చేయు డమరుకం అదేవిధంగా రూ 5 వేలు విలువ చేయు పంచ పాత్రలను విజయమ్మ,ఆలయ ప్రధాన అర్చకుడు వశిష్టాచార్యులకు, విరాళంగా అందించారు. ఉత్పన్న ఏకాదశి సందర్భంగా విశేష అలంకరణ చేశారు ఈ మేరకు భక్తులు స్వామి వారికి పూజలు నిర్వహించారు, గ్రామాల నుండి భక్తులు పాల్గొన్నారు,భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.



