
ప్రముఖ సినీ నటుడు 300 పైగా చిత్రాలలో విభిన్న తరహ పాత్రలతో తనకంటూ తెలుగువారి గుండెల్లో ప్రత్యేక పదిలపరుచుకున్నవరస నటుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కి, నట ప్రపూర్ణ టి.ఎల్. కాంతారావు మారక జాతీయ పురస్కారాన్ని ఆయన 102వ జయంతి (నవంబర్ 16న) సందర్భంగా అందించిన కార్యక్రమాల ఎంపిక కమిటీ ఛైర్మన్ కె.వి. రమణా చారి, కన్వీనర్ నాగబాల సురేష్ కుమార్ లు పత్రిక ప్రకటనలో తెలియజేసారు.
ఈ నెల 21వ తేదిన ఫిల్మ్ ఛాంబర్లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానం జరగనుంది.
గత 18 ఏళ్ళుగా కాంతారావు గారి జన్మదినాన్ని తాము నవంబర్ 16న చేస్తామని, కానీ ఈ సారి కొన్ని కారణాల వలన నవంబర్ 21న నిర్వహించాల్సి వచ్చిందని, ఆ రోజు కాంతారావు కుటుంబ సభ్యులు కూడా కార్యక్రమంలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.



