గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గం ఇంచార్జి నవంబర్ 15
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం లోని గడ్డంవారిపల్లి లో గత కొన్ని సంవత్సరాల నుండి బోయకొండ గంగమ్మ ఆలయం నిర్మాణం విషయంలో ఒకే గ్రామంలో ఒకే కులానికి చెందినవారు రెండు వర్గాలుగా ఏర్పడి,రెండు ఆలయాలు నిర్మాణం చేసుకొని,గొడవలు చేసుకొని, ఇరు వర్గాలు ఒకరిపైన ఒకరు కేసులు నమోదుచేసుకున్న సంఘటనల నేపత్యంలో ఈ మద్య పోలీసులు, రెవిన్యూ సిబ్బంది సంయుక్తంగా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు మేరకు గ్రామంలో ఇరువర్గాలను సదరు ఆలయ సమీపంలో విచారణ చేశారు. సదరు విచారణ లో ఎవరి ఆలయం వారు నిర్మించుకొనుటకు ఇరువర్గాలు పరస్పర అంగీకారం తెలపడంతో ఎవరిగుడి వారు నిర్మాణం చేసుకుంటామని తెలియజేయడంతో శనివారం తోటి గిరిబాబు జిల్లా కలెక్టర్ ను కలసి తమ ఆలయనిర్మాణం చేసుకొనుటకు అనుమతి కోరగా,ఎలాంటి అభ్యంతరం లేదని,కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.



