సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,సర్వేల్,నవంబర్16,(గరుడ న్యూస్):

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధి లోని సర్వేల్ గ్రామంలో శ్రీ రామోజు ప్రభాకర్ చారి దురదృష్టవశాత్తు మరణించారు.ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణా రెడ్డి,కి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు.ఈ నేపథ్యం లో చలమల్ల కృష్ణా రెడ్డి స్పందించి ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తక్షణ సహాయం కింద 10,000 పదివేల రూపాయలు బాధిత కుటుంబానికి అందించారు.ఈ కార్యక్రమంలో చలమల్ల యువసేన అధ్యక్షులు శ్రీరామోజు హరికుమార్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోయ నరసింహ,పగిళ్ల శ్రీను,పగిళ్ల కృష్ణ, చిలువెరు బిక్షపతి,నలపరాజు ప్రవీణ్,గ్రామస్తులు,కుటుంబ సభ్యులు,తదితరులు,పాల్గొన్నారు.



