సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,చౌటుప్పల్,నవంబర్18,
(గరుడ న్యూస్):

చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్వహిస్తున్న పనుల్లో భాగంగా లోతట్టు ప్రాంత ఇండ్లు,గాంధీ పార్క్ నుండి వచ్చే నాలా పుడికతీత పనులను స్థానిక మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రాంరెడ్డి పరిశీలించారు.త్వరితగతిన నాలాలను పరిశుభ్రం చేసి ప్రజా వినియోగం లోకి తేవాలని సానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్,సంబంధిత సిబ్బందికి ఆదేశించారు అదేవిధంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ ఊర చెరువును పరిశీలించారు.గత వర్షాలకు ఊర చెరువు నుండి అలుగు పోస్తుండడంతో చెరువులో ప్రస్తుతం నీటిమట్టాన్ని పరిశీలించి చెరువులోని నీటి పరిరక్షణకై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వర్క్ ఇన్స్పెక్టర్ కు ఆదేశాలిచ్చారు.చౌటుప్పల్ మున్సిపల్ లో మొత్తం 300 ఇళ్లకు గాను వివిధ నిర్మాణ దశలు రూఫ్ లెవెల్ లో 100,లెంటెల్ లెవల్ లో 160 ఇళ్ళు,నిర్మాణం పూర్తయిన 3 ఇళ్లలో రెండింటిని ఆవుల మమత,రాజు చిన్నకొండూరు రోడ్ హనుమాన్ దేవాలయం ప్రక్కన నిర్మించుకున్న ఇంటిని,శివాజీ నగర్ లోని శ్యామల అన్నపూర్ణ నిర్మించుకున్న ఇంటిని,మున్సిపల్ కార్మికురాలు బక్క సత్తమ్మ నిర్మించుకున్న ఇంటిని పర్యవేక్షించారు.అదేవిధంగా
చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 5 అంగన్వాడి కేంద్రాలు తంగడపల్లి హైస్కూల్,ప్రైమరీ స్కూల్,వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర ఉన్న అంగన్వాడి స్కూల్,బంగారుగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన,లింగారెడ్డి గూడెంలోని ప్రైమరీ స్కూల్ లో నిర్వహిస్తున్న అంగన్వాడి స్కూళ్ల ను మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు.మరుగుదొడ్ల నిర్మాణాలకై గుర్తించిన స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా సిబ్బందికి తగు సూచనలు చేస్తూ నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలని కాంట్రాక్టర్ కు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రామ నారాయణమూర్తి,బిల్ కలెక్టర్ భాస్కర్,హనుమాన్ ప్రసాద్,రేణు కుమార్,మున్సిపల్ సిబ్బంది,పాల్గొన్నారు.



