
ఎవరు ఆ ఐదుగురు
నార్త్ రిలీజ్ థియేటర్స్ ఎన్ని!
బాలయ్య జాతర మాత్రం ఖాయం
అభిమానుల్లో భారీ అంచనాలు
తనని ‘గాడ్ ఆఫ్ మాసెస్'(God Of Masses)అని ఎందుకు అంటారో మరోసారి ‘అఖండ పార్ట్ 2′(అఖండ 2)తో నటసింహం బాలకృష్ణ(బాలకృష్ణ)డిసెంబర్ 5న చాటి చెప్పనున్నాడు. పరమేశ్వరుడిని ఆరాధించే అఘోరగా, సోషల్ క్యారక్టర్ మురళి కృష్ణ గా సిల్వర్ స్క్రీన్ పై బాలయ్య చేసిన తాండవం ఒక రేంజ్ లో ఉండబోతుందనేది వాస్తవం. ప్రచార చిత్రాలు అందుకు తగ్గట్టుగా ఉండడంతో థియేటర్స్ లో బాలయ్య తాండవాన్ని వీక్షించడమే తరువాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచారు.
ఈ మేరకు రీసెంట్ గా ముంబై లో ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో బాలకృష్ణ తో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu)అఖండ 2 గురించి చెప్పిన బాలీవుడ్ మూవీ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో నార్త్ లో అఖండ 2 ఎన్నిథియేటర్స్ లో విడుదల అవుతుందనే ఆసక్తి అభిమానుల్లో ఏర్పడింది. బాలయ్య కెరీర్‌లోనే నార్త్‌లో ఫస్ట్ టైం డైరెక్ట్‌గా రిలీజ్ అవుతున్న మూవీ కావడంతో ఆ సినిమా కాస్త ఎక్కువగానే ఉంది. బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం నార్త్ లో అఖండ 2 అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: రాజమౌళి కి షాక్ ఇచ్చిన రాష్ట్రీయ వానరసేన.. సరూర్ నగర్ లో పోలీస్ కేసు నమోదు
నార్త్ హక్కులను ప్రముఖ కంపెనీ ‘జీ స్టూడియోస్'(Zee Studios)దక్కించుకుంది. ప్రతిష్టాత్మకమైన ఈ కంపెనీ చేతిలో ఎన్నో సింగల్ థియేటర్లు ఉన్నాయి. మల్టిప్లెక్స్ లు కూడా ఎక్కువ సంఖ్యలోనే జీ స్టూడియోస్ అధీనంలో ఉన్నట్లు టాక్. దీంతో అఖండ 2 భారీ స్క్రీన్స్ లో రిలీజ్ అవ్వడం పక్కా. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియా వేదికగా వచ్చిన అద్భుతమైన అఖండ 2 తో బాలయ్య నార్త్ ఎంట్రీ ఎంతో గ్రాండ్ గా ఉండబోతుందని, ఫస్ట్ రికార్డు కలెక్షన్స్ సాధించడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు.
డేవోషనల్ కంటెంట్ కి నార్త్ ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారనే విషయాన్నీ కూడా ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. డిసెంబర్ 5 డేట్ చూసుకుంటే మాత్రం బాలీవడ్ లో ‘ధురంధర్'(ధురంధర్)అనే మూవీ రిలీజ్ అవుతుంది. రణవీర్ సింగ్ , సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్స్ ఉన్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ అంశాలతో దురంధర్ ప్రదర్శించబడింది.



