




తెలంగాణ రాష్ట్రంలోనే మారుమూల ప్రాంతం సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ లోని జుజాల్పూర్ గ్రామ శివారులో గల ఈ తక్షిల పాఠశాలలో జరుగుతున్న జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ అట్టహాసంగా అద్భుతంగా ప్రదర్శించడం జరిగింది. జిల్లా సైన్స్ ప్రదర్శన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 729 సైన్స్ ప్రదర్శనలను బాల సైంటిస్టులు ప్రదర్శించడం జరిగింది. పిల్లల ప్రదర్శనలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇట్టి ప్రదర్శనకు ఈ తక్షిల పాఠశాల కరస్పాండెంట్ శరత్ పూర్తిస్థాయిలో అన్ని విధాలుగా సైన్స్ పేరును సహకరించి నిర్వహించడం జరిగింది. ఇట్టి సైన్స్ ప్రదర్శనలో ఆధునిక వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా విద్యార్థి నూతన ఒరవడిలో స్ప్రేయర్ ను తయారు చేసి ప్రదర్శించడం జరిగింది. ఇట్టి ప్రదర్శనను ఈ తక్షల పాఠశాల కరస్పాండెంట్ శరత్ నారాయణఖేడ్ ఎంఈఓ విశ్వనాద్, మనూరు ఎంఈఓ రాజశేఖర్, స్థానిక బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదవ రెడ్డి, జ్యూరీ మెంబర్ మల్లయ్య, కంగ్టి C.I. వెంకట్ రెడ్డి, పంచాయతి సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డి, స్థానిక మాజీ సర్పంచ్ జైపాల్ రెడ్డి, మనూరు మండల టిఆర్టి అధ్యక్షులు రమేష్ నారం ఖేడ్ మండల పిఆర్టియు ప్రధాన కార్యదర్శి రాజుగారు ఉపాధ్యాయులు శ్రీకాంత్ ,చంద్రశేఖర్ప్ర ఆచార్య ఇతర ఉపాధ్యాయులు వివిధ ప్రదర్శనలు పరిశీలించి అభినందించడం జరిగింది.


