దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు.. దైవం జోలికి వస్తే మేం ఖండిస్తాం! – Garuda Tv

Garuda Tv
3 Min Read


నటసింహ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో పవర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలకృష్ణ తన పెర్ఫార్మెన్స్‌తో, గర్జించే డైలాగులతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారు. నటసింహంలో నుంచి నట విశ్వరూపాన్ని ఎలా బయటికి తీసుకురావాలో, దానితో ప్రేక్షకుల చేత ఎలా చప్పట్లు కొట్టించాలో బోయపాటి శ్రీనుకి బాగా తెలుసు. ఇప్పటికే ఆ మ్యాజిక్‌ను మూడు సార్లు ప్రదర్శించి ప్రేక్షకుల చేత శభాష్‌ అనిపించుకున్న ఈ ఇద్దరు పవర్‌ఫుల్‌ జంట మరోసారి ‘అఖండ2’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ‘అఖండ2’ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను నవంబర్ 21న కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో అశేష అభిమానుల సమక్షంలో విడుదల చేసింది యూనిట్. కన్నడ స్టార్‌ హీరో డాక్టర్‌ శివరాజ్‌కుమార్‌ చేతుల మీదుగా ‘అఖండ2’ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు.

‘కష్టం వస్తే దేవుడు వస్తాడని నమ్మే జనాలని, కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మాలి. అలా వాళ్లు నమ్మిన రోజు భారతదేశం తునాతునకలైపోతుంది’ అనే కాన్సెప్ట్‌తో వచ్చిన శత్రుమూకల్ని తన దైవబలంతో అఘోరా ఎలా ఎదుర్కొన్నాడు, వారిని ఎలా మట్టు పెట్టాడు అనే విషయాన్ని తీసుకొని ఈ సినిమా చేసినట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రధానంగా అఘోర పాత్ర కనిపిస్తుందని, అతని శక్తితోనే విదేశీ శక్తుల మెడలు వంచుతాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ ట్రైలర్‌లో అఘోరా బాలకృష్ణ చెప్పిన ప్రధానమైన డైలాగులు అద్భుతంగా, ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించేలా, విజిల్స్‌ వేయించేలా ఉన్నాయి.

‘ప్రపంచంలో మీరు ఏ దేశమెళ్లినా మీకక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటుచూసినా మీకు కనిపించేది ఒక ధర్మం.. సనాతన హైందవ ధర్మం’, ‘దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు.. దైవం జోలికి వస్తే మేం ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్‌ స్ట్రైక్‌’, ‘ఇప్పటివరకు ప్రపంచ పటంలో నా దేశ రూపాన్ని మాత్రమే చూస్తుంటావ్‌.. ఎప్పుడూ మా దేశ విశ్వరూపాన్ని చూసుండవ్‌.. మేమొకసారి లేచి శబ్దం చేస్తే.. ఈ ప్రపంచమే నిశ్శబ్దం’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌లు నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఉన్నాయి. ఒక్కో డైలాగ్‌కి ప్రేక్షకులకు, అభిమానులకు గూస్‌బంప్స్‌ రావడం ఖాయం. ట్రైలర్‌తోనే ఇంత విశ్వరూపాన్ని చూపిన బాలకృష్ణ సినిమాలో తన నట విశ్వరూపంతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో అని ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా డిసెంబర్ 5 కోసం సృష్టించారు.

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో ఎలాంటి అంశాలు ఉండాలో, ఎలాంటి సర్‌ప్రైజ్‌లు ఉండాలో అవన్నీ ‘అఖండ2’లో ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఫ్యాన్స్‌ కోరుకునే మాస్‌ ఎలిమెంట్స్‌, పవర్ బాలకృష్ణ‌ఫుల్‌ డైలాగ్స్‌తో, అఘోరా చూపించే నట విశ్వరూపంతో ట్రైలర్‌ ఎంతో ఆసక్తికరంగా ఉంది. బోయపాటి శ్రీను మార్క్‌ పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, ఎలివేషన్‌ షాట్స్‌.. బాలకృష్ణ మార్క్‌ యాక్షన్‌, ‘అఖండ 2: తాండవం’ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. ఎస్‌.థమన్‌ కంపోజ్‌ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి పెద్ద ప్లస్‌ పాయింట్‌ కాబోతోంది. ఒరిజినల్‌ లొకేషన్స్‌లో చిత్రీకరించిన అద్భుతమైన సీన్స్ ప్రేక్షకులకు కనువిందు చేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట తయారయ్యారు. బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పిస్తున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 5న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది ‘అఖండ2’.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *