అదొక సామ్రాజ్యం.. స్వయంభు రిలీజ్ డేట్ పై కీలక అప్డేట్ ఇచ్చిన నిఖిల్ – Garuda Tv

Garuda Tv
2 Min Read


-నిఖిల్ కీలక వీడియో విడుదల
-స్వయంభు రిలీజ్ డేట్ వచ్చేసింది
-పాన్ ఇండియా వ్యాప్తంగా అంచనాలు
-అభిమానుల నిరీక్షణ

పాన్ ఇండియా ప్రేక్షకులకే కాదు చైనీస్, అరబిక్, స్పానిష్ లాంగ్వేజెస్ వాళ్ళకి కూడా భారతదేశ చరిత్రలో ఎవరు గుర్తించారని ఒక గొప్ప యోధుడి జీవిత చరిత్ర చెప్పబోతున్న మూవీ ‘స్వయంభు(స్వయంభు). యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్ అంశాలతో తెరుచుకుంటుంది. కార్తికేయ 2 తో పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించిన ‘నిఖిల్ సిద్దార్ధ్'(నిఖిల్ సిద్ధార్థ)మరోసారి స్వయంభు తో అభిమానులని తన వశం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో ‘స్వయంభు’ రూపంలో సిల్వర్ స్క్రీన్ పై ఒక కొత్త ప్రపంచం ఆవిష్కరించబడుతుందనే విషయం అర్ధమవుతుంది. దీంతో అభిమానులు, ప్రేక్షకులు స్వయంభు కోసం ఎంతో ఆసక్తితో ఉన్నారు.

రీసెంట్ గా మేకర్స్ ‘స్వయంభు’ కి చెందిన ఒక వీడియోని రిలీజ్ చేసారు. అందులో నిఖిల్ మాట్లాడటం ఒక్క సినిమా.. రెండు సంవత్సరాల కష్టం. పదుల సంఖ్యలో సెట్లు. అదొక సామ్రాజ్యం. వేల కొద్దీ సవాళ్లతో కూడిన ఒక యుద్ధం. మాకున్న ఒకే ఒక్క లక్ష్యం లక్షల మంది ప్రేక్షకులు. కోట్ల పెట్టుబడి.. మా నిర్మాతల నమ్మకం.. ఇదే మా స్వయంభు.. మన భారత దేశ చరిత్రలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఒట్టి రాజుల కథలో యుద్ధకథలో కాదు.

మన సంస్కృతికి పునాదులు. ఆ చరిత్రలో చెప్పని గొప్పయోధుడు కథే స్వయంభు అని చెప్పిన నిఖిల్ వీడియోని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇదే వీడియోలో తాను సినిమాలో ఉపయోగించిన గుఱ్ఱం(మారుతీ) ని పరిచయం చేయడంతో పాటు సాంకేతిక నిపుణుల పేరు పేరున పరిచయం చేసాడు. సుమారు రెండు నిమిషాల సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియో అభిమానులని, మూవీ లవర్స్ ని ఎంతగానో ఆకర్షిస్తుంది. వచ్చే ఫిబ్రవరి 13న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుందని కూడా అధికారికంగా ప్రకటించారు.


కూడా చదవండి: రెబల్ సాబ్ సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ ఇదే.. మరి ఫ్యాన్స్ ఏమంటారో

ఈ వీడియో ద్వారా రవి బసూర్ అందించిన ఆర్ ఆర్, లెజండ్రీ ఫోటోగ్రాఫర్ సెంథిల్ కుమార్(kk సెంథిల్ కుమార్)అందించిన ఫొటోగ్రఫీ ఏ స్థాయిలో ఉండబోతుందో తెలుస్తుంది. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ లు నిర్మిస్తుండగా భరత్ కృష్ణమాచారి(భరత్ కృష్ణమాచారి)దర్శకుడు. యుద్ధవీరుడు గా నిఖిల్ కనిపిస్తుండగా అఖండ 2(అఖండ 2 ఫేమ్ సంయుక్త మీనన్(samyuktha Menon) హీరోయిన్.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *