
పది రోజుల్లో అఖండ-2 తాండవం
రోజురోజుకి పెరిగిపోతున్న అంచనాలు
సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సాంగ్స్, ట్రైలర్
టాలీవుడ్ నుండి త్వరలో విడుదల కానున్న అత్యంత హైప్డ్ సినిమాలలో ‘అఖండ-2’ ముందు వరుసలో ఉంటుంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో డిసెంబర్ 5న రానున్న ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా అఖండ-2 ఫీవర్ ప్రారంభమైంది. (అఖండ 2 తాండవం)
అసలే బాలయ్య-బోయపాటి కాంబో, దానికితోడు అఖండ సీక్వెల్ కావడంతో.. ‘అఖండ-2’పై అంచనాలు వేరే స్థాయిలో ఉన్నాయి. అందుకు శాంపిల్ అన్నట్టుగా.. సాంగ్స్, ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌తో పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఇవి ట్రెండింగ్‌లో ఉన్నాయి.
అఖండ-2 నుండి ఫస్ట్ సింగిల్ గా ‘తాండవం’ సాంగ్ నవంబర్ 14న విడుదలైంది. ఇప్పటికే 12 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించిన ఈ సాంగ్.. యూట్యూబ్ మ్యూజిక్ లో టాప్-11లో ట్రెండ్ అవుతోంది.
సెకండ్ సింగిల్ గా ‘జాజికాయ’ నవంబర్ 18న విడుదల కాగా, ఇప్పటికే 10 కి పైగా వ్యూస్ మిలియన్ సాంగ్. అంతేకాదు, యూట్యూబ్ మ్యూజిక్‌లో-5లో ట్రెండ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: మహేష్ ‘వారణాసి’లో ఎన్టీఆర్ కొడుకు భార్గవ్ రామ్!
ఇక అఖండ-2 ట్రైలర్ నవంబర్ 21న రిలీజ్ అయింది. అన్ని వర్గాల నుండి సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ట్రైలర్.. ఇప్పటికే 22 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించి, ట్రెండింగ్‌లో ఉంది.
సరిగ్గా మరో పదిరోజుల్లో డిసెంబర్ 5న అఖండ-2 తాండవం మొదలు. విడుదలకు ముందే ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్న ఈ చిత్రం.. విడుదల తర్వాత ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.



