
థియేటర్లలో అడుగుపెట్టిన ఆంధ్ర కింగ్ తాలూకా
ప్రీమియర్స్ టాక్ ఎలా ఉంది?
రామ్ హిట్ కొట్టాడా?
అందరి హీరోల అభిమానులకు కనెక్ట్ అయ్యే స్టోరీతో అభిమాని బయోపిక్‌గా రూపొందించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ థియేటర్లలో అడుగుపెట్టింది. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా నేడు(నవంబర్ 27) విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు పూర్తయ్యాయి. ట్విట్టర్ లో ఈ మూవీ టాక్ ఎలా ఉందంటే..?
ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం ట్విట్టర్‌లో పాజిటివ్ రివ్యూలు కనిపిస్తున్నాయి. హీరో-అభిమాని ట్రాక్ ని, ప్రేమకథను బ్యాలెన్స్ చేస్తూ సినిమా తెరకెక్కించిన తీరు బాగుంది. ముఖ్యంగా ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని, కథని నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేసారు. నిడివి ఎక్కువ ఉండి, అక్కడక్కడా నెమ్మదిగా సాగినట్లు అనిపించేలా.. ఓవరాల్ గా గుడ్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుందని అనిపిస్తుంది. ఎమోషన్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్, మ్యూజిక్, డైలాగ్స్ ప్రధానంగా నిలిచాయని ట్విట్టర్ ట్విట్టర్ లో రాసుకొస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఫస్ట్ రివ్యూ!
ఆంధ్ర కింగ్ తాలూకాకు ట్విట్టర్‌లో దాదాపుగా అన్నీ పాజిటివ్ రివ్యూలే కనిపిస్తున్నాయి. సినిమా ఇంత బాగుంటుందని అసలు ఊహించలేదని, ముఖ్యంగా క్లైమాక్స్ కోసమైనా ఈ సినిమా చూడొచ్చని అంటున్నారు.
ఇక రామ్ అభిమానులైతే.. తమ హీరో మాస్ ఊబి నుండి బయటకు వచ్చి, ఒక మంచి సినిమా చేశాడని.. ఎట్టకేలకు హిట్ కొట్టేశాడని సంబర పడుతున్నారు.



