దేవతనగర్ లో కిషోర్ ఇంటికి వెళ్లి ఎంపీ పరామర్శ..

హాజరైన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి,.
నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ ..
వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు..
గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గం ఇంచార్జి 27/11/2025 . వైయస్సార్సీపి రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మిద్దింటి కిషోర్ ను రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పరామర్శించారు. గురువారం మదనపల్లి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో కలిసి ఎంపీ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. సుమారు నెలరోజుల కిందట మిద్దింటి కిషోర్ ద్విచక్ర వాహనంలో వెళుతూ ప్రమాదానికి గురై గాయపడ్డారు. తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొంది మదనపల్లి పట్టణంలోని దేవత నగర్ లో ఉన్న తన ఇంటిలో విశ్రాంతి పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీ దేవత నగర్ లోని కిషోర్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కొద్దిసేపు ఇద్దరూ పలు రాజకీయాలపై చర్చించారు. వైఎస్ఆర్సిపి బలోపేతం కోసం చేసే కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నారు. ఎంపీ వెంట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్, మున్సిపల్ చైర్ పర్సన్ మనూజ రెడ్డి, వైస్ చైర్మన్ జింక వెంకటాచలపతి, జడ్పిటిసి ఉదయ్ కుమార్, రామసముద్రం మండల కన్వీనర్ కేశవరెడ్డి, సర్పంచులు పి మహేష్ బాబు, శరత్ రెడ్డి, వలసపల్లి నాగరాజ రెడ్డి, వైయస్సార్సీపి యువజన విభాగం అన్నమయ్య జిల్లా కార్యదర్శి ఖాదర్ యువ ,కౌన్సిలర్ సుగుణ ఆంజనేయులు, వైసిపి నాయకురాలు రేవతి తదితరులు పాల్గొన్నారు.


