( పెద్ద పంజాణి మండలం గరుడ న్యూస్ 28.11.2025. ) పెద్దపంజాని ఎంపీడీఓ మీటింగ్ హాల్ నందు SHG గ్రూప్ సభ్యులు, VOA గ్రూప్ సభ్యులతో పర్యావరణాన్ని పరిరక్షించడం – పచ్చదనాన్ని పెంపొందించడం” పై నిర్వహించిన శిక్షణా శిబిరం నందు పాల్గొని, ప్రసంగించిన పెద్దపంజాని ఎంపీడీఓ ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ మండలంలో పర్యావరణాన్ని పరిరక్షించడం, పచ్చదనాన్ని పెంపొందించడం అనే లక్ష్యాలతో, ఈరోజు నుండి SHG (మహిళా స్వయం సహాయక సంఘాలు) మరియు VOA (గ్రామ సంఘాల సహాయకులు) సభ్యులకు ఒక ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము.మహిళా శక్తిని ఉపయోగించి ప్లాస్టిక్ నియంత్రణ, తడి-పొడి చెత్త నిర్వహణ మరియు అధికంగా మొక్కలు నాటే అంశాలపై వీరికి సమగ్ర శిక్షణ అందిస్తున్నాము.మహిళా సంఘాల చొరవతోనే గ్రామీణ స్థాయిలో పర్యావరణంలో పెద్ద మార్పు తీసుకురాగలమని మా నమ్మకం. ఈ శిక్షణతో ప్రతి మహిళా సభ్యురాలు ఒక ‘గ్రీన్ అంబాసిడర్’ గా పనిచేస్తుంది.
మన మండలాన్ని పరిశుభ్రంగా, పచ్చగా ఉంచడానికి ఈ కార్యక్రమం ఎంతో కీలకం అని ఎంపీడీఓ తిలియచేసారు .ఈ శిక్షణా శిబిరం నందు వీరితో పాటు మండల స్థాయి అధికారులు, SHG గ్రూప్ సభ్యులు, VOA గ్రూప్ సభ్యులు, తదితరులు పాల్గొనినారు.



