అల్లు అర్జున్ పై అట్లీ చేస్తున్న అద్భుతమైన ప్రయోగం.. తెలిస్తే షాక్ – Garuda Tv

Garuda Tv
1 Min Read


‘పుష్ప2’ వంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ చేయబోతున్న సినిమాపై ఇప్పటి నుంచే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి. అట్లీ కాంబినేషన్‌లో బన్నీ చేస్తున్న ఈ సినిమా భారీ స్థాయిలో ఉండబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన అరుదైన విశేషం. ఇందులో అల్లు అర్జున్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఈ సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్‌గా జరుగుతోంది. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో, మోడ్రన్‌ టెక్నాలజీతో సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నారు అట్లీ. అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే మొదటిసారి మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. మూడు ప్రపంచాలకు సంబంధించిన కథగా ఈ సినిమా ఉండబోతోంది. అట్లీ ఊహించిన దానికంటే ఎక్కువగా బన్నీ పెర్‌ఫార్మ్‌ కనిపిస్తోంది. ఎంతో కేర్‌ఫుల్‌గా అట్లీ డిజైన్‌ చేసిన ఒక ఏజ్డ్ క్యారెక్టర్ కూడా అందులో ఉంది. ఆ పాత్రను అల్లు అర్జున్‌ తనదైన స్టైల్‌లో అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. రెండోసారి ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డు అందుకునే రేంజ్‌లో అతని పెర్‌ఫార్మెన్స్‌ యూనిట్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.

ఆ గెటప్‌, ఆ క్యారెక్టర్‌ ఈ సినిమాకి వెరీ స్పెషల్‌ కాబోతోంది. సినిమా రిలీజ్ వరకు ఆ క్యారెక్టర్‌ని సస్పెన్స్‌లోనే ఉంచాలని డిసైడ్ అయ్యారు. అల్లు అర్జున్, అట్లీ ప్రత్యేకంగా ఆ క్యారెక్టర్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారని. దానికోసం ఐ సహకారం కూడా తీసుకుంటున్నారు. అలాగే విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం ప్రపంచ స్థాయి కంపెనీలు పనిచేస్తున్నాయి. ఈ సినిమాతో అల్లు అర్జున్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *