
-శర్వానంద్ రిస్క్ చేస్తున్నాడా!
-నిర్మత ట్వీట్ వైరల్
-2016 లో ఏం జరిగింది
హీరో శర్వానంద్(sharwanand)సినిమాలు ఏంచుకునే శైలికి, మిగిలిన హీరోలు ఎంచుకునే సినిమాల శైలికి ఎంతో వైవిధ్యం ఉంటుంది. దీనికి శర్వానంద్ గత చిత్రాలే ఉదాహరణ. గత ఏడాది రొమాంటిక్ డ్రామా ‘మనమే’ తో పలకరించగా ఇప్పుడు ఫ్యామిలీ జోనర్ లో తెరకెక్కిన ‘నారి నారి నడుమ మురారి'(నారి నారి నడుమ మురారి)తో ముస్తాబవుతున్నాడు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(బాలకృష్ణ)నుంచి వచ్చిన హిట్ మూవీ టైటిల్ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కూడా నెలకొని ఉంది.
ఇక ఈ చిత్రం సంక్రాంతికి వస్తుందని మేకర్స్ కొన్ని రోజుల క్రిందట ఒక పోస్టర్ ద్వారా తెలిసింది. కానీ ఆ తర్వాత అప్ డేట్ లేకపోవడంతో బడా సినిమాలు సంక్రాంతి బరిలో ఉండటంతో పండక్కి రాకపోవచ్చని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వచ్చాయి. కానీ రీసెంట్ గా నారి నడుమ మురారి నిర్మాత ‘అనిల్ సుంకర'(అనిల్ సుంకర)ఎక్స్(X)వేదికగా వస్తున్న ‘అబ్బాయిలు ఎవరికైనా 2016 సంక్రాంతి సినిమా ఫలితాలు గుర్తున్నాయా? అంటూ ట్వీట్ చేసాడు.
ఈ ట్వీట్ చూస్తుంటే పొంగల్ బరిలోకి మూవీని రిలీజ్ చేస్తున్నట్లు అభిమానులతో పాటు మూవీ లవర్స్ అందిస్తోంది. అనిల్ సుంకర ట్వీట్ ప్రకారం చూసుకుంటే 2016 సంక్రాంతికి శర్వానంద్ ‘ఎక్స్ ప్రెస్ రాజా’ అనే మూవీతో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. ఆ టైంలో నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా’, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో’, బాలకృష్ణ డిక్టేటర్ తో స్క్రీన్ పై సందడి చేసినా’ఎక్స్ ప్రెస్ రాజా’ చిత్రాలతో విజయాన్ని అందుకున్నారు.
కూడా చదవండి: నెంబర్ వన్ గా నిలుస్తాడా!
2017లో కూడా ‘ఖైదీ నెం 150 ,గౌతమీ పుత్ర శాతకర్ణి ఉన్నా ‘శతమానం భవతి’తో విజయాన్ని అందుకుంది. మరి ఇప్పుడు ఈ సంక్రాంతికి ప్రభాస్ ‘ది రాజాసాబ్’, చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, విజయ్ ‘జన నాయకుడు’, శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ వంటి సినిమాలు రేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘నారీ నారీ నడుమ మురారి’తో మరోసారి శర్వానంద్ సంక్రాంతి బరిలో దిగితే ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ‘సామజవరగమన’ ఫేమ్ ‘రామ్ అబ్బరాజు’ దర్శకత్వంలో నారి నారి నడుమ మురారి తెరకెక్కుతుండగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా చేస్తున్నారు.



