– శక్తి కార్యాలయం వద్ద మహిళలు ధర్నా
గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గం ఇంచార్జి 04/12/2025.పుంగనూరు మండలంలోని మంగళం గ్రామ పంచాయతీ జెట్టిగుండ్లపల్లెకి చెందిన శివశక్తి పొదుపు సంఘం సభ్యులు బుధవారం పట్టణంలోని శక్తి కార్యాలయం వద్ద మహిళలు ధర్నా చేశారు. వివరాలిలా ఉన్నాయి. పంచాయతీకిచెందిన సంఘమిత్ర మహిళలు పొదుపు చేసిన సుమారు రూ.30 లక్షల రూపాయలను ఖాతాల్లో జమ చేయకుండ స్వాహా చేశారని మహిళలు ఆరోపిస్తూ నినాదాలు చేశారు. గత నెల 13న జరిగిన సమావేశంలో ఏపిఎం కృష్ణప్ప సమక్షంలో 15 మంది మహిళలకు చెందిన డబ్బులు వాడుకున్నట్లు సంఘమిత్ర అంగీకరించిందని, కానీ నెల రోజులు గడుస్తున్న చెల్లించకపోవడంతో సంఘ మహిళలు అప్పులు తీర్చలేక , వడ్డీలు చెల్లించలేకపోతున్నామంటు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకుని సంఘమిత్ర స్వాహా చేసిన రూ.30 లక్షలు వసూలు చేయించాలని వెలుగు కార్యాలయం వద్ద ధర్నా చేశారు.



